News April 11, 2024
కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్‌కు 15 ఏళ్ల జైలు

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Similar News
News March 30, 2026
AIFF చీఫ్ వేధించారు: మాజీ సీఎం కూతురు

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే తనను వేధించారని మహిళా అధికారి వాలంకా అలెమావో ఆరోపించారు. మార్చి 29న జరిగిన AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబే, ఇతర అధికారులు హేళన చేసి వేధించారని ఫిర్యాదు చేశారు. ‘నాపై అనవసర, అగౌరవకర వ్యాఖ్యలు చేశారు. నన్ను భయపెట్టేందుకు హద్దులు దాటి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. గోవా Ex CM చర్చిల్ అలెమావో కూతురైన వాలంకా AIFF మహిళా కమిటీ చీఫ్‌గా ఉన్నారు.
News March 30, 2026
‘108’ సంఖ్య విశిష్టత గురించి తెలుసా?

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News March 30, 2026
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. అందుకే నిపుణుల సూచనలతో సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని వాడితే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.


