News August 23, 2024
పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ గమనించాలి: పోలీసులు
TG: యుక్తవయసు పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ‘డ్రగ్స్ మత్తుకు బానిసగా మారిన యువత కుటుంబంతో పాటు సమాజానికీ ప్రమాదకరం. డ్రగ్స్ నుంచి పిల్లల్ని కాపాడే బాధ్యత పోలీసులకు ఎంత ఉందో పేరెంట్స్‌కూ అంతే ఉంది’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 40వేల మంది డ్రగ్స్ బాధితులను టీన్యాబ్ గుర్తించిందని, వారిలో విద్యావంతులు, ఉన్నతోద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2024
నేడు ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం
AP: రాష్ట్రంలో నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశముంది. MLAల పనితీరు, భవిష్యత్తు కార్యచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
News September 18, 2024
ఆ కారణంతో రాబోయే 25 ఏళ్లలో 3.9 కోట్ల మంది మృతి!
వైద్యానికి లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(AMR) వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది మరణించారని ఓ గ్లోబల్ సర్వే పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య 3.9 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో సుమారు 1.18 కోట్ల మంది మరణిస్తారని హెచ్చరించింది. వైద్యరంగంలో ఎంతో సాంకేతికత సాధించినా AMR ఇప్పటికీ సవాల్‌గానే ఉంది.
News September 18, 2024
రూ.లక్ష కడితే టీడీపీలో శాశ్వత సభ్యత్వం: చంద్రబాబు
AP: ₹లక్ష చెల్లించిన వారికి TDP శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని పార్టీ నేతలతో CM చంద్రబాబు అన్నారు. లక్ష మంది సభ్యులు చేరితే, వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. పలువురు నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు.