News July 22, 2024

పారిస్ ఒలింపిక్స్ మస్కట్ విశేషాలివే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో మస్కట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రీజ్ అని పిలిచే ఈ మస్కట్ నీలి కళ్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫ్రెంచి సంప్రదాయంలో భాగమైన ఫ్రీజియన్ క్యాప్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో క్యాప్‌లను స్వేచ్ఛకు చిహ్నంగా వాడారు. ‘క్రీడలు అన్నింటిని మార్చగలవు’ అనే సూత్రంతోనే దీనిని రూపొందించారు. ఆటల్లో సమష్టితత్వాన్ని చాటేలా తయారు చేశారు.

Similar News

News November 7, 2025

ఫ్లైట్స్ డిలే.. క్రమంగా తొలగుతున్న సమస్య!

image

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తలెత్తిన టెక్నికల్ <<18227103>>సమస్య<<>> క్రమంగా తొలగుతున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి విమానాలు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా టెక్నికల్ గ్లిచ్‌తో ఏటీఎస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన 500కు పైగా విమానాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలోనూ ఈ సమస్య ఎదురైంది.

News November 7, 2025

బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

image

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.

News November 7, 2025

HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

image

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?