News May 19, 2024

రేపటి నుంచి CISF పహారాలో పార్లమెంట్

image

నూతన పార్లమెంట్ భద్రత బాధ్యతలను రేపటి నుంచి CISF చేపట్టనుంది. 3,317 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా పనిచేసేవి. గత డిసెంబర్‌లో ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించడంతో కలకలం చెలరేగింది. దీంతో భద్రత బాధ్యతలను CISFకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

Similar News

News December 6, 2024

మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి

image

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్‌ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News December 6, 2024

రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

News December 6, 2024

పుష్ప-2 డైలాగ్స్.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

image

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.