News July 3, 2024

అమృత్‌పాల్‌కు పెరోల్.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

image

దిబ్రుగడ్ జైల్లో ఉన్న‘వారీస్ పంజాబ్ దే’ చీఫ్, ఖలీస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు 4 రోజుల పెరోల్ లభించింది. దీంతో ఎల్లుండి ఆయన ఖాడూర్ సాహిబ్ ఎంపీగా లోక్‌సభ స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసిన అమృత్‌పాల్ సుమారు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Similar News

News November 8, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌(<>IIIM)<<>> 19 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in/

News November 8, 2025

కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News November 8, 2025

భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.