News July 3, 2024
అమృత్‌పాల్‌కు పెరోల్.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

దిబ్రుగడ్ జైల్లో ఉన్న‘వారీస్ పంజాబ్ దే’ చీఫ్, ఖలీస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు 4 రోజుల పెరోల్ లభించింది. దీంతో ఎల్లుండి ఆయన ఖాడూర్ సాహిబ్ ఎంపీగా లోక్‌సభ స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసిన అమృత్‌పాల్ సుమారు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Similar News
News December 8, 2025
భారీ జీతంతో AMPRIలో 20 పోస్టులు.. అప్లై చేశారా?

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(AMPRI)లో 20సైంటిస్ట్, Sr సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.TECH, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన సైంటిస్ట్‌కు నెలకు రూ.1,26,900, Sr సైంటిస్ట్‌కు రూ.1,46,770 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in/
News December 8, 2025
రబీ వరి నాట్లు.. రైతులకు కీలక సూచనలు

వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న వరి రకాలకు చెందిన 21 రోజుల నారును సిద్ధం చేసిన పొలంలో మరీ లోతుగా కాకుండా పైపైన నాటుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనలు తుంచడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయాలు నాశనమవుతాయి. దీని వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. నారుమడులలో, వెదజల్లే పొలాల్లో నవంబర్-డిసెంబరులో భారీ వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
News December 8, 2025
చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.


