News March 20, 2024
రోహిత్‌పై పార్థివ్ ప్రశంసల వర్షం

ముంబై మాజీ సారథి రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. CSK సారథిగా ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ రోహిత్ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదన్నారు. హార్దిక్, బుమ్రాను యాజమాన్యం పక్కనపెట్టాలని భావించినా.. రోహిత్ మద్దతుగా నిలిచారన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో భాగమయ్యారని తెలిపారు. రోహిత్ కెప్టెన్సీలో MI రెండు సార్లు ఒక పరుగు తేడాతో కప్ గెలిచిందన్నారు.
Similar News
News February 3, 2026
వాట్సాప్‌లో యాడ్స్.. మీకు వస్తున్నాయా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో కీలక మార్పు మొదలైంది. కొన్ని రోజులుగా స్టేటస్, ఛానెల్స్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగత చాట్స్, కాల్స్ పూర్తిగా యాడ్ ఫ్రీగానే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. యూజర్ లొకేషన్, లాంగ్వేజ్ ఆధారంగా యాడ్స్ చూపిస్తున్నాయి. దీనిపై పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News February 3, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు

<
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.


