News March 23, 2024

పార్టీ మారేవారిని ప్రజలే చెప్పులతో కొడతారు: పల్లా

image

TG: బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడేందుకే కొందరు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను బీఆర్ఎస్ బయట పెడుతుందన్నారు. ఇక అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని పల్లా మండిపడ్డారు.

Similar News

News September 17, 2024

రేపు ఉదయంలోగా నిమజ్జనాలు పూర్తి: సీపీ

image

TG: హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాలు కాకుండా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. అటు నిమజ్జన ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సీవీ ఆనంద్ హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.

News September 17, 2024

‘బిగ్ బాస్’ ఫేమ్ సోహెల్‌ తల్లి కన్నుమూత

image

‘బిగ్ బాస్’ ఫేమ్, సినీ నటుడు సోహెల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆయన తల్లి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోహెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి. దీంతో ఆమె పార్థీవదేహాన్ని స్వస్థలానికి తరలించారు. ‘కొత్త బంగారు లోకం’తో సోహెల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

News September 17, 2024

త్రివిక్రమ్‌ను ప్రశ్నించండి: పూనమ్

image

జానీ మాస్టర్‌పై రేప్ కేసు నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అప్పుడే అతడిపై “మా” చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు. త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.