News October 8, 2024
లేడీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. ఎందుకంటే?

TG: ఆధార్ కార్డు విషయంలో ఓ ప్రయాణికురాలు లేడీ కండక్టర్‌పై దాడి చేశారు. HYDలోని ECIL నుంచి ఉప్పల్ వెళుతున్న బస్సులో సరిత ఎక్కారు. కండక్టర్ రాగా జీరో టికెట్ కోసం ఆధార్ చూపించారు. అందులో AP అడ్రస్ ఉండటంతో అది చెల్లదని కండక్టర్ చెప్పారు. దీంతో ఆ కండక్టర్‌పై దాడి చేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విస్ట్ ఏంటంటే సరితపై ఇప్పటికే బ్లాక్ మెయిల్ చేసిన కేసులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Similar News
News December 11, 2025
భారత్‌కి సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

స్టార్‌లింక్ ద్వారా భారత్‌కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నానని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్‌తో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమైన తరువాత మస్క్ ఈ విధంగా స్పందించారు. భారత్‌లో చివరి మైలు కనెక్టివిటీని శాటిలైట్ ద్వారా విస్తరించే దిశగా చర్చలు జరిగాయని సింధియా ‘X’లో పోస్ట్ చేశారు. డిజిటల్ భారత్ లక్ష్యాలకు శాటిలైట్ టెక్నాలజీ కీలకమని అన్నారు.
News December 11, 2025
రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి
News December 11, 2025
550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కపుర్తాలాలోని <


