News December 18, 2024
పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న BRS కార్యకర్త సురేశ్ సహా మొత్తం 24 మందికి బెయిల్ వచ్చింది.
Similar News
News November 27, 2025
GNT: ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం..!

గుంటూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రోసూరుకు చెందిన ఓ బాలిక నగరంలో బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య ఆ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత బాలికకు వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఈ క్రమంలో పోక్సో నమోదు చేశామన్నారు.
News November 27, 2025
ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

వాషింగ్టన్లోని వైట్హౌస్ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్మెన్లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్హౌస్ను లాక్డౌన్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.


