News December 18, 2024
పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్
TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న BRS కార్యకర్త సురేశ్ సహా మొత్తం 24 మందికి బెయిల్ వచ్చింది.
Similar News
News January 24, 2025
అకౌంట్లోకి డబ్బులు.. BIG UPDATE
TG: రైతుభరోసా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మొత్తం 1.49 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైనవిగా ప్రాథమికంగా గుర్తించింది. ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తేల్చి, వాటి సర్వే నంబర్లను బ్లాక్ చేసింది. మొత్తంగా రైతు భరోసా కింద రూ.8900 కోట్లు అవసరం అవుతాయని అధికారుల అంచనా.
News January 24, 2025
RTCలో సమ్మె సైరన్
TGSRTCలో సమ్మె సైరన్ మోగింది. హైర్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 27న HYDలోని బస్‌భవన్ ముందు ధర్నాకు దిగనున్నాయి. ఆ రోజే యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి. RTC <<15210949>>ప్రైవేటీకరణలో <<>>భాగంగా హైర్ పద్ధతిలో బస్సులు ప్రవేశపెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. RTC డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు.
News January 24, 2025
రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ కుటుంబాలు
AP: రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 2016-17లో నాబార్డ్ రూరల్ ఫైనాన్షియల్ సర్వే ప్రకారం 34 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 2021-22లో ఆ సంఖ్య 53 శాతానికి చేరింది. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో 19శాతం మేర వ్యవసాయ కుటుంబాలు పెరిగినట్లైంది. అటు దేశ సరాసరి కూడా 48% నుంచి 57%కు పెరిగింది. APతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల్లో 50శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి.