News November 19, 2024

పట్నం నరేందర్ రెడ్డికి జైలులో స్పెషల్ బ్యారక్

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు తోటి ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని జైలు అధికారులను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం కూడా అనుమతించాలని పేర్కొంది. కాగా లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో ఉంటున్నారు.

Similar News

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

image

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.