News November 19, 2024

పట్నం నరేందర్ రెడ్డికి జైలులో స్పెషల్ బ్యారక్

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు తోటి ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని జైలు అధికారులను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం కూడా అనుమతించాలని పేర్కొంది. కాగా లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో ఉంటున్నారు.

Similar News

News December 14, 2024

TODAY HEADLINES

image

* అల్లు అర్జున్ అరెస్ట్.. మధ్యంతర బెయిల్ మంజూరు
* అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
* సంధ్య థియేటర్ కేసు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న CM రేవంత్
* స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన CM చంద్రబాబు
* నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: YS జగన్
* హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
* ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ICC ఆమోదం

News December 14, 2024

అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు నిరాశ

image

అల్లు అర్జున్ రేపు ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.

News December 14, 2024

అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

image

అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.