News April 24, 2024

మే 24న పాలిసెట్

image

TG: మే 24న ‘పాలిసెట్-2024’ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రూ.300 ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24న పరీక్ష నిర్వహించి, 10 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘పాలిసెట్’ నిర్వహిస్తారు. సైట్: https://polycet.sbtet.telangana.gov.in

Similar News

News February 8, 2026

వారంలో భారీగా తగ్గిన ధరలు

image

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ నెల 1-7 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3,980 తగ్గి రూ.1,56,600కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.3,650 తగ్గి రూ.1,43,550గా ఉంది. అటు కేజీ వెండి ధర ఫిబ్రవరి 1న రూ.3.20 లక్షలుగా ఉండగా నిన్నటి వరకు రూ.2.85 లక్షలకు చేరింది. వారంలోనే ఏకంగా రూ.35వేలు తగ్గింది. రాబోయే రోజుల్లో ఇదే పతనం కొనసాగనుందని సమాచారం.

News February 8, 2026

భాను సప్తమి పూజా విధానం

image

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.

News February 8, 2026

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.