News August 24, 2024
“క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” కాన్సెప్ట్ తో పవన్ బర్త్‌డే: జనసేన

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. వేప, చింత, ఉసిరి, రావి, నేరేడు లాంటి దేశీయ వృక్షజాతి మొక్కలు నాటుదామని తెలిపింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామని పేర్కొంది. “క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” నినాదంతో నిర్వహిద్దామని ట్వీట్ చేసింది.
Similar News
News January 19, 2026
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.


