News April 3, 2024
పవన్కు తీవ్ర జ్వరం.. పర్యటనలు రద్దు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. జ్వరంతో హైదరాబాద్కు వెళ్లిన జనసేనానికి కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు ట్వీట్ చేసింది. పర్యటన రీ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
Similar News
News December 6, 2025
BECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్సైట్: https://www.becil.com
News December 6, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.
News December 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 88

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


