News November 30, 2024

‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పవన్!

image

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. అయితే, ఎన్నిరోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ ఉంటుందో తెలియాల్సి ఉంది.

Similar News

News February 2, 2026

BIG NEWS: మోదీతో ట్రంప్ చర్చలు

image

కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య సందిగ్ధంలో ఉన్న ట్రేడ్ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. PM మోదీతో US అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్లు భారత్‌లోని US రాయబారి సెర్జియో గోర్ Xలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూడండని రాసుకొచ్చారు. దీంతో సుంకాలు, H1B వీసాలపై కీలక ప్రకటన వెలువడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ ఫొటోతో ట్రంప్ హింట్ <<19033803>>ఇచ్చారంటున్నారు.<<>>

News February 2, 2026

లేట్ నైట్ నిద్రపోతున్నారా? బీ కేర్‌ఫుల్..

image

‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజా స్టడీ ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు చాలా ఎక్కువగా ఉంది. బాడీ క్లాక్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. వీరికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16% ఎక్కువగా ఉంటోంది. సరైన నిద్ర, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ అలవాటు కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

News February 2, 2026

ఇండియా గేట్ ఫొటో షేర్ చేసిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్‌నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.