News November 30, 2024
‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో పవన్!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. అయితే, ఎన్నిరోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ ఉంటుందో తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2024
పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.
News December 6, 2024
RRRకు క్యాబినెట్ హోదా
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను కూటమి ప్రభుత్వం ఇటీవల శాసనసభ డిప్యూటీ స్పీకర్గా నియమించిన విషయం తెలిసిందే.
News December 6, 2024
ఈనెల 13 నుంచి వైసీపీ ఉద్యమబాట
AP: ఈనెల 13 నుంచి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. 13న రైతు సమస్యలపై, ఈనెల 27న కరెంటు ఛార్జీల మోతపై, 2025 జనవరి 3న విద్యార్థులకు బాసటగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపింది. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొంది. సంక్రాంతి నుంచి వైఎస్ జగన్ జనంలోకి వస్తారని తెలిపింది.