News April 4, 2024

అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించనున్న ఆయన.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీకి చెందిన బుద్ధప్రసాద్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

Similar News

News January 26, 2026

వాడిపోయిన తులసి మొక్కను ఏం చేయాలంటే?

image

ఎండిపోయిన తులసి మొక్క పట్ల నిర్లక్ష్యం తగదు. దాన్ని ఎలా పడితే అలా పారవేయకూడదు. పవిత్రంగా స్నానం చేసి, విష్ణువును ధ్యానిస్తూ తొలగించాలి. పవిత్రమైన చోట పాతిపెట్టాలి. పారే నదిలో నిమజ్జనం చేసినా మంచిదే. ఈ ప్రక్రియను గురువారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చేయడం మంచిది. రోడ్ల పక్కన, చెత్తలో వేస్తే ప్రతికూలత పెరుగుతుంది. నియమబద్ధంగా తొలగిస్తే తెలియక చేసిన దోషాలు తొలగి, భగవంతుని కృప లభిస్తుంది.

News January 26, 2026

పిల్లల్ని ఎలాంటి స్కూల్లో చేర్చాలంటే?

image

స్కూల్‌ కేవలం చదువు కోసం మాత్రమే కాదు పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం కూడా అంటున్నారు నిపుణులు. స్కూల్ దూరం, ఖర్చు, విద్యా ప్రమాణాలు, సెక్యూరిటీ వంటి విషయాలను ప్రధానంగా తెలుసుకోవాలి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వారికి తగ్గ స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యం. చదువుతో పాటు క్రీడలు, కళలను ప్రోత్సహించే పాఠశాలల్లో చేర్చడం మంచిది. గత ఫలితాలు, టీచింగ్, టీచర్లకు ఉన్న అర్హతలు వంటివి తెలుసుకోవడం ముఖ్యం.

News January 26, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో 987 పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయాల్లో 987 (TGT 493, ప్రైమరీ టీచర్ 494) స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వీటిని భర్తీ చేయనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రకటించింది. వెబ్‌సైట్: https://kvsangathan.nic.in/