News January 11, 2025
రూ.10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్
AP: విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో Dy.CM పవన్ కళ్యాణ్ రూ.10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫెయిర్‌లోని ‘ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
Similar News
News January 23, 2025
టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
AP: ఎవ్వరు ఏమనుకున్నా టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం లోకేశ్‌దేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. కూటమికి 164 సీట్లు రావడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అంశం ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదని చెప్పారు. పదవులైనా, నిర్ణయాలైనా కూటమి ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.
News January 23, 2025
శ్రీలంకపై భారత్ విజయం
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.
News January 23, 2025
₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!
కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.