News June 18, 2024

విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్

image

AP: విజయవాడలో నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈ గెస్ట్ హౌస్‌ను జనసేనాని సందర్శించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం, పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. మరికాసేపట్లో సచివాలయానికి వెళ్లి తన పేషీని పవన్ పరిశీలించనున్నారు.

Similar News

News January 23, 2026

జగన్‌ పాలనలో అన్ని వర్గాలకూ వేధింపులే: మంత్రి స్వామి

image

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ వేధించారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన ధ్వజమెత్తారు.

News January 23, 2026

టుడే టాప్ స్టోరీస్

image

* ముగిసిన AP, TG సీఎంలు చంద్రబాబు, రేవంత్ దావోస్ పర్యటన
* ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు నోటీసులు.. రేపు విచారణ
* రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: YS జగన్
* తిరిగి రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి
* బ్యాడ్మింటన్‌లో 500 విజయాలు సాధించిన భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డ్
* భారత్‌లో T20WC ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
* లాభాల్లో మార్కెట్లు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

News January 23, 2026

టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

image

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.