News September 30, 2024
మిథున్ చక్రవర్తికి పవన్ కళ్యాణ్ అభినందనలు

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. నేను నటించిన ‘గోపాల గోపాల’లో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
HYD: ఆన్లైన్ బెట్టింగ్.. మరో యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్‌కు చెందిన సాయి (24) శాంతినగర్‌లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.


