News September 30, 2024
మిథున్ చక్రవర్తికి పవన్ కళ్యాణ్ అభినందనలు
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. నేను నటించిన ‘గోపాల గోపాల’లో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి
రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
News October 9, 2024
ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్
AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.
News October 9, 2024
FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్
ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.