News June 11, 2024
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్

AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.
Similar News
News September 13, 2025
ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్‌కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్‌లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్‌ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్‌ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.