News November 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.
Similar News
News November 12, 2025
మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.
News November 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 12, 2025
పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.


