News March 21, 2024

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ 2 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. జనసేన ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా, తమ పార్టీ కోరుతున్న స్థానాలపై ఇద్దరు సమీక్షిస్తున్నారు. అటు త్వరలోనే జనసేన మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News February 11, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

image

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)

News February 11, 2025

అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

image

అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.

News February 11, 2025

సైఫ్‌కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

image

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

error: Content is protected !!