News June 5, 2024
తనకు ఆసక్తి ఉన్న శాఖలు ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్

జనసేనానికి హోం శాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రస్ట్ అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో. మీరు పిఠాపురం ఎమ్మెల్యేను ఏ మంత్రిగా చూడాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News December 10, 2025
సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4,000!

రేపు ఉదయం 7 గంటలకు TGలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 పంచుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు చేతిలో పెట్టి, ఓటు వేయాలని దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డే లేదు.
News December 10, 2025
గ్లోబల్ సమ్మిట్కు విద్యార్థులు.. PHOTO GALLERY

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.
News December 10, 2025
వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


