News October 18, 2024

‘వీరమల్లు’ సెట్‌లోనే పాట పాడిన పవన్ కళ్యాణ్!

image

రాజకీయాల్లో బిజీగా ఉన్న Dy.CM పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొన్నారు. అందులోని ఫస్ట్ సింగిల్‌ను పాడినట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా, దానికి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. స్టూడియోలో కాకుండా వీరమల్లు సెట్‌లో గంట వ్యవధిలోనే ఆయన పాటను రికార్డ్ చేసినట్లు సమాచారం. మరోవైపు NOV 10లోగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News November 4, 2024

వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!

image

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.

News November 4, 2024

పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

News November 4, 2024

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)