News February 23, 2025
అపోలో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు మెడికల్ టెస్టులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకుంటారని పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పవన్ వైరల్ ఫీవర్, వెన్నునొప్పితో బాధపడ్డారు.
Similar News
News February 23, 2025
పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వ పవర్ సంస్థలు!

ప్రభుత్వ రంగానికి చెందిన 5 విద్యుత్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. అవసరమైన నిధులు సమీకరించేందుకు IPO ద్వారా వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సంస్థలు పబ్లిక్ ఇష్యూ కోసం బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. మరో 3 డిస్కమ్‌లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 23, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.10

అనంతపురంలో కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.10 పలికింది. సరాసరి ధర రూ.8, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.20,700 తో అమ్ముడయ్యాయి.
News February 23, 2025
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.