News February 23, 2025
అపోలో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు మెడికల్ టెస్టులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకుంటారని పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పవన్ వైరల్ ఫీవర్, వెన్నునొప్పితో బాధపడ్డారు.
Similar News
News March 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 19, 2025
యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 19, 2025
TODAY HEADLINES

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం