News January 9, 2025

తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

image

AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

Similar News

News January 13, 2026

MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

image

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.

News January 13, 2026

‘యువత’ జైలు పాలు

image

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.

News January 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.