News September 5, 2024
వృద్ధురాలి కష్టాలకు చలించిన పవన్ కళ్యాణ్

AP: ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కృష్ణవేణి(75) పవన్‌కు కష్టాలు చెప్పుకోవాలని విజయవాడకు వచ్చింది. పంచాయతీరాజ్ కమిషనరేట్ గేటు బయట కూర్చుంది. బయటకొస్తూ ఆమెను చూసిన ఆయన భోజనం చేయలేదని గ్రహించారు. కారులో ఎక్కించుకుని ఆహారం పెట్టించాక సమస్యలు విన్నారు. భర్త లేడని, పెన్షన్ చాలడం లేదని, కొడుకు పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలనడంతో పవన్ చలించారు. అధికారులకు చెప్పి ఇంటి నిర్మాణానికి నిధులు ఇప్పించారు.
Similar News
News November 7, 2025
టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.
News November 7, 2025
ఈ వ్యాధులు ఉంటే అమెరికా వీసా కష్టమే!

వీసా నిబంధనలను కఠినం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుండె సంబంధ సమస్యలు, రెస్పిరేటరీ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిని అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
News November 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్‌లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్


