News September 5, 2024

వృద్ధురాలి కష్టాలకు చలించిన పవన్ కళ్యాణ్

image

AP: ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కృష్ణవేణి(75) పవన్‌కు కష్టాలు చెప్పుకోవాలని విజయవాడకు వచ్చింది. పంచాయతీరాజ్ కమిషనరేట్ గేటు బయట కూర్చుంది. బయటకొస్తూ ఆమెను చూసిన ఆయన భోజనం చేయలేదని గ్రహించారు. కారులో ఎక్కించుకుని ఆహారం పెట్టించాక సమస్యలు విన్నారు. భర్త లేడని, పెన్షన్ చాలడం లేదని, కొడుకు పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలనడంతో పవన్ చలించారు. అధికారులకు చెప్పి ఇంటి నిర్మాణానికి నిధులు ఇప్పించారు.

Similar News

News September 13, 2024

రూ.10,032 కోట్ల నష్టం: సీఎం రేవంత్

image

TG: భారీ వర్షాలు, వరదలకు రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి CM రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్లు దెబ్బతినడంతో 7,693 కోట్లు, అర్బన్ డెవలప్‌మెంట్‌-రూ.1216 కోట్లు, ఇరిగేషన్‌-రూ.483 కోట్లు, తాగునీటి పథకం-రూ.331 కోట్లు, వ్యవసాయం-రూ.231 కోట్లు, విద్యుత్-రూ.179 కోట్లు, మత్స్యశాఖకు రూ.56 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు.

News September 13, 2024

20న ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’

image

రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతికి చెందిన ఓ నిరుద్యోగి కష్టాల చుట్టూ సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఇంద్రజ, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.

News September 13, 2024

హైజాక్ ఫ్లైట్‌లో నా తండ్రీ ఉన్నారు: జైశంకర్

image

1984 విమాన హైజాక్ ఘటనపై ‘IC-814’ మూవీ వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘హైజాకర్లతో సంప్రదింపులు జరిపిన బృందంలో నేనూ సభ్యుడిని. కొన్నిగంటల తర్వాత విమానంలో నా తండ్రి కూడా ఉన్నారని తెలిసింది. అది నాకు చాలా భిన్నమైన అనుభవం. ఓవైపు ప్రభుత్వం తరఫున జవాబుదారీతనం, మరోవైపు గవర్నమెంట్‌పై ఒత్తిడి తెచ్చిన బాధిత కుటుంబంలో సభ్యుడిగా ఉండాల్సి వచ్చింది’ అని తెలిపారు.