News May 12, 2024
తన ఓటు తనకు వేసుకోలేని పవన్ కళ్యాణ్!

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేశ్ పోటీ చేస్తుండటంతో పవన్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
Similar News
News November 5, 2025
హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్‌సైట్: https://hansrajcollege.ac.in/
News November 5, 2025
నాకు బతికే అర్హత లేదు అంటూ హీలియం గ్యాస్ పీల్చి..

AP: ఇటీవల CA పరీక్షల్లో ఫెయిలైన విశాఖకు చెందిన అఖిల్ వెంకట కృష్ణ (29) అనే విద్యార్థి తల్లిదండ్రులకు భావోద్వేగపూరిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మిమ్మల్ని మోసం చేశా. ఇక నాకు బతికే అర్హత లేదు, క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకున్నాడు.
News November 5, 2025
బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకుండదో తెలుసా?

నేషనల్ హైవేస్ టోల్ రూల్స్ 2008 రూల్ 4(4) ప్రకారం టూవీలర్స్ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కార్లు, హెవీ వెహికల్స్‌తో పోలిస్తే బైకులతో రోడ్లు ఎక్కువ డ్యామేజ్ కావు. బండి కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కడతాం. దానినే పరోక్షంగా రోడ్లు, హైవేల నిర్వహణకు వాడతారు. బైక్‌పై టోల్ ట్యాక్స్ వేస్తే ఆదాయం కంటే.. డబ్బు వసూలు చేయడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకు మించి అన్ని టోల్స్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.


