News May 12, 2024
తన ఓటు తనకు వేసుకోలేని పవన్ కళ్యాణ్!

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేశ్ పోటీ చేస్తుండటంతో పవన్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
Similar News
News February 16, 2025
మోదీ కులంపై ఏంటీ వివాదం? రేవంత్ చెప్పింది నిజమేనా?

గుజరాత్‌కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీది ‘మోద్ ఘాంచి’ కులం. మోదీ జన్మించినప్పుడు ఆయన కులం ఓసీ జాబితాలో ఉండేది. మండల్ కమిషన్ సిఫారసుతో గుజరాత్ ప్రభుత్వం 1994లో ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. అప్పటికి మోదీ ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ మోదీ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీల్లో చేర్చారని సీఎం రేవంత్ అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
News February 16, 2025
ఫాస్టాగ్ కొత్త రూల్స్.. చెక్ చేసుకోండి

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.
News February 16, 2025
నిద్రలేవగానే ఇలా చేయండి

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.