News January 23, 2025

లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్

image

AP ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సమానులైన లోకేశ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

image

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.

News February 14, 2025

దారుణం.. బుల్లెట్ బైక్ నడిపాడని చేతులు నరికేశారు

image

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

News February 14, 2025

జులపాల జుట్టుతో స్టార్ క్రికెటర్లు.. చూశారా?

image

ఏఐ సహాయంతో కొందరు క్రియేట్ చేసిన స్టార్ క్రికెటర్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్లు పొడవాటి జుట్టుతో ఉంటే ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. కోహ్లీ, రోహిత్, బట్లర్, కేఎల్ రాహుల్, బాబర్ ఆజమ్, విలియమ్సన్ వంటి ప్లేయర్ల ఫొటోలను ఉపయోగించారు. ఈ ఫొటోలు చూసిన క్రికెట్ లవర్స్ సూపర్ అంటున్నారు. లాంగ్ హెయిర్‌తో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలు అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!