News April 9, 2024
ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల అద్దెకు తీసుకున్న ఇంట్లో గృహ ప్రవేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నాయి. కాగా రేపు తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో చంద్రబాబుతో కలిసి ఆయన ప్రచారం చేయనున్నారు.
Similar News
News January 10, 2025
20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
News January 10, 2025
ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం
TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 10, 2025
‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం
TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.