News January 10, 2025

‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

image

TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.

Similar News

News February 17, 2026

మార్చి మొదటి వారంలో SSC హాల్ టికెట్లు

image

AP: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్కూల్ లాగిన్, ‘మన మిత్ర’ యాప్ ద్వారా వీటిని పొందవచ్చన్నారు. పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ సరిచూసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లలో పొరపాట్లున్నా ఆందోళన చెందవద్దని సూచించారు. యూడైస్ పోర్టల్‌లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందన్నారు.

News February 17, 2026

ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అంటే?

image

ట్రెండ్ అయ్యే ప్రతి హెయిర్ స్టైల్ అందరికీ సెట్ కాదంటున్నారు నిపుణులు. ఫేస్ షేప్‌ని బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోవాలంటున్నారు. రౌండ్, స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్నవారికి బ్యాంగ్స్ బావుంటాయి. జుట్టు కెరటాల్లా అందంగా కనిపించాలంటే లాంగ్ కర్టెన్ బ్యాంగ్స్ చేయించుకోవాలి. రౌండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ బావుంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా కనిపించడంతో పాటు అన్ని డ్రెస్సుల మీదకీ సెట్ అవుతుంది.

News February 17, 2026

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.