News November 6, 2024
పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News December 5, 2025
టిఫా స్కాన్‌లో ఏం చెక్ చేస్తారంటే?

టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
News December 5, 2025
ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.
News December 5, 2025
IIT జోధ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

IIT జోధ్‌పూర్‌లో 24 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MTS, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్స్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీపీటీ, ఎంపీటీ, బీఎస్సీ నర్సింగ్, GNM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు LMV/HMV లైసెన్స్ ఉండాలి. వెబ్సైట్: https://www.iitj.ac.in/


