News November 6, 2024
పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News December 8, 2024
బుమ్రాకు గాయమైందా?
అడిలైడ్‌లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్‌లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.
News December 8, 2024
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నేడు HYD ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో షో జరగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి షో ముగిసే వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
News December 8, 2024
పసుపు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం!
భారతీయ వంటల్లో పసుపు ఓ భాగం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగని అధికంగా పసుపు వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు అంటున్నారు. డయేరియా, గ్యాస్ సమస్యలతో పాటు పసుపులో ఉన్న వేడి కలిగించే లక్షణం అలర్జీకి కారణమవుతుందట. గర్భిణీలు పసుపు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని, మోతాదు మించితే గర్భాశయ కండరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.