News September 24, 2024

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: YCP నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. YCP నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News September 24, 2024

కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

image

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.

News September 24, 2024

భారత్, చైనా ఫైట్‌లో సాండ్‌విచ్ అవ్వలేం: దిసనాయకే

image

జియో పొలిటికల్ రైవల్రీకి శ్రీలంకను దూరంగా ఉంచుతానని ప్రెసిడెంట్ దిసనాయకే అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల్లో సమతూకం పాటిస్తానని చెప్పారు. ‘ఆ ఫైట్‌కు మేం దూరంగా ఉంటాం. అలాగే ఏదో ఒక పక్షం వైపు ఉండం. ప్రత్యేకించి భారత్, చైనా మధ్య సాండ్‌విచ్ అవ్వలేం. ఆ 2 మాకు మిత్రదేశాలే. అవి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. EU, మిడిల్ఈస్ట్, ఆఫ్రికాతో సంబంధాలు కొనసాగిస్తాం’ అని తన ఫారిన్ పాలసీ గురించి వివరించారు.

News September 24, 2024

మా బౌలర్లు అహంకారులు: పాక్ మాజీ పేసర్

image

తమ దేశ బౌలర్లు తామే గొప్ప అనే భావనలో ఉంటారని పాకిస్థాన్ మాజీ పేసర్ బాసిత్ అలీ అన్నారు. అందుకే మోర్నే మోర్కెల్‌ను చిన్న చూపు చూసి పక్కనపెట్టారని మండిపడ్డారు. ‘భారత్, పాక్ ఆటగాళ్ల మైండ్ సెట్ వేరు. పాక్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌ను టీమ్ ఇండియా చిత్తు చేసింది. పాక్ ఒత్తిడికి గురైంది. భారత్ కాలేదు. మోర్కెల్ కోచింగ్‌ను టీమ్ ఇండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.