News September 24, 2024

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: YCP నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. YCP నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News October 7, 2024

అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ

image

రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.

News October 7, 2024

పాజిటివ్ సిగ్నల్స్ పంపిన ఆసియా స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. జపాన్ నిక్కీ, తైవాన్ సూచీలు 2% మేర పెరిగాయి. హాంగ్‌సెంగ్, స్ట్రెయిట్ టైమ్స్, గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఎకానమీ, జాబ్ డేటా మెరుగ్గా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణాలు. పైగా డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు పెరిగాయి. RBI MPC ప్రభావం మన మార్కెట్లపై ఉండొచ్చు.

News October 7, 2024

టమాటా కిలో రూ.100

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు అమాంతం పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లు, మండీలలోనే ధర రూ.80-90 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.100 దాటేసింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధర కూడా రూ.70-80కి చేరింది. కిలో బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు.