News November 4, 2024

నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ఆయన అనంతరం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమీక్ష చేస్తారు. రాత్రికి చేబ్రోలులోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న పవన్ రేపు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు.

Similar News

News December 4, 2024

హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు

image

సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(GSEC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ ఆగస్టులో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఏర్పాటు చేయనున్న తొలి సెంటర్ ఇదే. GSEC దేశంలో అధునాతన సెక్యూరిటీ, ఆన్‌లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించనుంది. సైబర్ సెక్యూరిటీలో పరిశోధనలకు వేదికగా నిలవనుంది.

News December 4, 2024

భూకంపం టెన్షన్.. అదే కారణమా?

image

ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85వేల చెట్లు నేలకూలాయి. వీటిలో 50-100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటం, బొగ్గు గనులు ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

News December 4, 2024

PSLV-C59 ప్రయోగం వాయిదా

image

శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన PSLV-C59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4.12 గంటలకు రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.