News April 13, 2025
రేపు శ్రీవారి దర్శనానికి పవన్ కళ్యాణ్ సతీమణి

AP: Dy.CM పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదల రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి మొక్కులు చెల్లించనున్నారు. కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్న ఆమె గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.
Similar News
News November 19, 2025
సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. కడప(D) పెండ్లిమర్రి సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. తానూ రైతు బిడ్డనే అని, నాన్నకు వ్యవసాయంలో సాయం చేసేవాడినని వెల్లడించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే అన్నదాత సుఖీభవ కింద రూ.14వేలు అందజేశామని పేర్కొన్నారు. సాగు తీరు మారి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నామన్నారు.
News November 19, 2025
అన్నదాత సుఖీభవ రెండో విడత.. రూ.3,135 కోట్లు జమ

AP: పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 46,85,838 రైతుల అకౌంట్లలో రూ.3,135 కోట్లను జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.
News November 19, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>


