News November 27, 2024
ఇవాళ ప్రధానితో పవన్ భేటీ
AP: ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్కీము పొడిగించాలని ప్రధానిని కోరనున్నారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. నిన్న కూడా పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి నిధుల విషయమై చర్చించిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2024
ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.
News December 3, 2024
7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు
మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.
News December 3, 2024
పాగల్ ‘ఫెంగల్’.. 1,500kmల ప్రభావం
ఫెంగల్ తుఫాను భిన్న రూపాల్లో ముప్పుతిప్పలు పెట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. 5 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.