News September 5, 2024
కరకట్టపై CM ఇంటిని పవన్ కూల్చాలి: అంబటి

AP: వరదలు వస్తే ఎలా వ్యవహరించాలో CM చంద్రబాబుకు తెలియదని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. బాబు అసమర్థత వల్లే విజయవాడలో వరదలు సంభవించాయని ఆరోపించారు. ‘కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. మునిగిపోయే ఇంట్లో ఉండటం ఆయన తప్పు. బుడమేరు ఆక్రమించారని dy.CM పవన్ అంటున్నారు. మరి కరకట్టపై CM ఇల్లు ఉంది. ఆ నివాసాన్ని కూల్చివేసి పవన్ శెభాష్ అనిపించుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 23, 2025
రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి?

భారత్లో రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి? అనే సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. టీ, బాయిల్డ్ ఎగ్, చిన్న సమోసా, సిగరెట్, లోకల్ ట్రైన్ టికెట్, చిప్స్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్, పెన్సిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రూ.10కి కొనగలిగే బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.
News November 23, 2025
మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

ప్రేమ, తృప్తి, త్యాగం, నిగ్రహం.. ఈ సత్కర్మలే మనిషిని జీవింపజేస్తాయి. మంచి మనిషి అనే పేరు తెస్తాయి. అసూయ, అత్యాశ, ద్వేషం, పగ వంటి దుష్కర్మలు మనిషిని దహింపజేస్తాయి. ఇవి ఉన్న మనిషి బతికున్న శవం వంటివాడు. అధికారం, అహంకారం, ఆనాలోచనలు జీవితానికి చెరుపు తెస్తాయి. అప్పు, యాచన ఎప్పుడూ చేయకూడదు. లక్ష్యం, సహనం, వినయం, విధేయత వంటి సద్గుణాలతో జీవించి, వ్యామోహం, స్వార్థం వదిలితేనే ఉత్తమ కర్మఫలాన్ని పొందుతాం.
News November 23, 2025
‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


