News September 5, 2024
కరకట్టపై CM ఇంటిని పవన్ కూల్చాలి: అంబటి
AP: వరదలు వస్తే ఎలా వ్యవహరించాలో CM చంద్రబాబుకు తెలియదని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. బాబు అసమర్థత వల్లే విజయవాడలో వరదలు సంభవించాయని ఆరోపించారు. ‘కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. మునిగిపోయే ఇంట్లో ఉండటం ఆయన తప్పు. బుడమేరు ఆక్రమించారని dy.CM పవన్ అంటున్నారు. మరి కరకట్టపై CM ఇల్లు ఉంది. ఆ నివాసాన్ని కూల్చివేసి పవన్ శెభాష్ అనిపించుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News September 12, 2024
ఒకే టీమ్‌లో కోహ్లీ, బాబర్ అజామ్?
త్వరలో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రో-ఆసియా కప్‌ను ICC తిరిగి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆసియా జట్టు తరఫున కోహ్లీ, రోహిత్, బాబర్, బుమ్రా, అఫ్రీది, రిజ్వాన్ వంటి ఆటగాళ్లు కలిసి ఆడనున్నారు. గతంలో ఆసియా జట్టులో సెహ్వాగ్, అఫ్రీది, సంగక్కర, జయవర్ధనే, ఇంజమామ్, నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ కలిసి ఆడారు.
News September 12, 2024
‘కాంచన 4’లో పూజా హెగ్డే?
హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
News September 12, 2024
శరవేగంగా వారణాసి స్టేడియం పనులు
వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.