News November 5, 2024

పవన్ బయటపడ్డారు, మేము పడలేదంతే: అనిత

image

AP: నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, పవన్ కళ్యాణ్ బయటపడ్డారని, తాము పడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆయన మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో పోలీసులు విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడ్డారని అనిత ఆరోపించారు. గతంలో రాజకీయంగా నేరాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.

Similar News

News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.

News October 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.