News November 5, 2024
పవన్ బయటపడ్డారు, మేము పడలేదంతే: అనిత

AP: నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, పవన్ కళ్యాణ్ బయటపడ్డారని, తాము పడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆయన మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో పోలీసులు విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడ్డారని అనిత ఆరోపించారు. గతంలో రాజకీయంగా నేరాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.
Similar News
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News July 11, 2025
రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.