News November 26, 2024
నిర్మలా సీతారామన్‌తో ముగిసిన పవన్ భేటీ
AP: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో Dy.CM పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘25 లక్షల జనాభాకు 7 వేల కి.మీ రోడ్లు నిర్మించాలని అడిగా. ఇప్పటికి 9 లక్షల జనాభాకే నిర్మాణం జరిగింది. రహదారుల నిర్మాణానికి AI బ్యాంక్ నుంచి నిధులు ఇప్పించాలని మంత్రిని కోరా. 90 శాతం నిధులు ఆ బ్యాంక్ నుంచి వచ్చేలా చూడాలని అడిగా. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2024
ఉద్యోగాల్లో రోబోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో రోబోల వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఇవి అత్యధిక సంఖ్యలో వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 10వేల మంది ఉద్యోగులకు 1,102 రోబోలు ఉన్నాయి. 2008 నుంచి పోల్చితే వీటి వినియోగం 5శాతం పెరిగింది. ఈ దేశం రోబోటిక్స్ వైపు మళ్లడంతో పనుల్లో మానవ శ్రమ తగ్గి ఉత్పాదకత పెరిగింది.
News December 4, 2024
‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.
News December 4, 2024
అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి: జగన్
AP: కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘సూపర్ 6 అమలుపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.